కంటి వెలుగును విజయవంతం చేయాలి: కడియం

వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): కంటివెలుగు ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంలో చిత్తశుద్దితో కార్యక్రమాన్‌ఇన నిర్వహించాలని డపి/-యూటి సిఎం కడియం శ్రీహరి సూచించారు. ఎక్కడా అజాగ్రత పనికిరాదన్నారు. అన్ని కార్యక్రమాల లాగే దీనిని కూడా విజయవంతం చేయాలన్నారు. హరితహారం, కంటి వెలుగు, రైతు బంధు పథకాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.51 కోట్ల 71 లక్షలు ఖర్చు చేయనుందని తెలిపారు. చిత్తశుద్ధితో అధికారులు,ప్రజాప్రతినిధులు పని చేస్తేనే కంటి వెలుగు విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే చేపట్టింది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించుకుంటామని ప్రకటించారు. అనేక పథకాలు ప్రారంభించుకున్నాం. ఈ తరుణంలో అధికారులకు పని ఒత్తిడి కలుగుతుంది. ఈ సమయంలోనే మన పనితనం బయటపడుతుంది. 3 కోట్ల 50 లక్షల మందికి కంటి పరీక్షలు చేయనున్నాము. కంటి జబ్బు లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.