కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలికంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

– చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప రాణి
చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 15 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప రాణి, వార్డ్ కౌన్సిలర్ ఆడెపు నరేందర్ కోరారు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బీడీ కాలనీలో బుధవారం కంటి వెలుగు పరీక్షా కేంద్రాన్ని స్థానిక కౌన్సిలర్ తో కలిసి చైర్ పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికి దృష్టి లోపం ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జి.రాజేంద్ర కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్లు మంగోలు చంటి, సందుల సురేష్, పచ్చిమడ్ల సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.