కంటి వెలుగు ను ప్రారంభించిన సర్పంచ్ బత్తిని తిరుమలేష్కంటి వెలుగు ను ప్రారంభించిన సర్పంచ్ బత్తిని తిరుమలేష్

మోత్కూరు ఫిబ్రవరి 15 జనంసాక్షి : మోత్కూరు మండలం పనకబండ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బత్తిని తిరుమలేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.18 ఏండ్లు పైబడిన వారందరికీ పరీక్షలు చేస్తారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు గ్రామంలో ప్రతి ఒక్కరు కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.వైద్యాధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కంటి వెలుగు పథకం రూపుదిద్దుతుందని ప్రజలకు పరీక్షలు నిర్వహించి కళ్ళ అద్దాలు అవసరమైన వారికి శాస్త్ర చికిత్సలు చేసి మందులు అందించడం జరుగుతుందన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ  బుషిపాక లక్ష్మి మారయ్య, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, పొన్నెబొయిన నాగమ్మ, ఫైళ్ల రమేష్ కారుపోతుల ముత్యాలు, పొన్నెబొయిన మచ్చగిరి, బత్తిని అంజయ్య, మహేశ్వరం రాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.