కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్  శ్రీనివాస్కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్  శ్రీనివాస్

జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లి గ్రామ పంచాయితీ లో  తెలంగాణ  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణా ముఖ్య మంత్రి  కెసిఆర్  జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్  ఆదేశాల మేరకు గ్రామ పంచాయితీ కార్య లయంలో బుధవారం గ్రామ సర్పంచ్  కణవేన శ్రీనివాస్ ప్రారంభించారు. బుధవారం నుండి 5 రోజుల వరకు నిర్వహించటం జరుగుతుందని,  గ్రామ ప్రజలకి  కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అద్దాలు పంపిణీ చేయడం  జరుగుతుందన్నారు. రచ్చపల్లి గ్రామంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు అందరు పాల్గోని  కంటి పరీక్షలు చేపించుకోవలని సర్పంచ్ కోరారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనవెన శ్రీనివాస్ తో పాటు ఎంపీటీసీ మిరియాల ప్రసాద్ రావు, ఉప సర్పంచ్ గుర్రం సదానందం. వార్డ్ మెంబర్లు అషడపు సురేష్, కొల్లూరి భాగ్య నాగరాజు, వడ్ల కొండా సునీత శ్రీనివాస్, పంచాయితీ సెక్రటరీ హరీష్, డాక్టర్ అనూష, డీఈవో చంద్ర శేకర్, శ్రీదేవి, ఏఎన్ఎం జ్యోతీ, స్రవంతి, ఆశ వర్కలు సునీత, రజిత, శంకరమ్మ, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.