కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభం కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభం 

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  చేపట్టిన కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్  ఆదేశాల మేరకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లోని 5వ వార్డు అమరవాది పాఠశాలలో  కంటి వెలుగు శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, స్థానిక 5వ వార్డు కౌన్సిలర్ జిలకర మహేష్ లు సంయుక్తంగా మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పేద ప్రజల కొరకు సీఎం కేసీఆర్ కంటి వెలుగుతో చీకటి బ్రతుకుల్లో కొత్త వెలుగు నింపేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉచితంగా పరీక్షలు జరిపి, అవసరం ఉన్నవారికి కళ్ళ అద్దాలు ఇవ్వడంతో పాటు అవసరం అయిన వారికి శాస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా కంటి వెలుగు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నాగరాజు, వైద్యాధికారులు నాయకులు లింగయ్య, రాజయ్య, ఈశ్వరయ్య, పోచం, యాదగిరి, శ్రీనివాస్, రాము,బీఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్, ఆర్పీలు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.