కంది కొనుగోళ్లకు రంగం సిద్దం

 

 

మార్క్‌ఫెడ్‌ ద్వారా మద్దతు ధరలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా మార్కెట్‌ యార్డుల్లో కంది కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా పంటను కొనుగోలు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా ఆదిలాబాద్‌, బోథ్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనథ్‌ మార్కెట్‌యార్డుల ద్వారా పంటను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాదాపు రెండు లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది సైతం మార్క్‌ఫెడ్‌ ద్వారా జిల్లాలో కంది కొనుగోళ్లు చేశారు. వివిధ మార్కెట్‌యార్డుల్లో ఈ సంవత్సరం కంది కొనుగోళ్లకు ముందస్తుగా చర్యలు తీసుకోవడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ పంటలను విక్రయించే అవకాశం ఏర్పడింది.పంట దిగుబడులు ఎక్కువగా ఉండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను విక్రయించి మద్దతు ధర పొందారు. ఈసారి సైతం మార్కెట్‌ యార్డుల్లో మార్క్‌ఫెడ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన రైతులు దళారుల బా రిన పడి నష్ట పోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వానాకాలం పత్తి, సో యాబీన్‌తో పాటు కంది పంటను రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. ప్రస్తుతం పత్తి,సోయా పంటల కొనుగో ళ్లు జరుగుతుండగా కంది దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. కనీస మద్దతు ధర ప్రకటించగా రైతులకు నష్టపోకుండా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో రైతులు పత్తి, సోయాతో పాటు కంది పంటను అధికంగా సాగుచేస్తారు. పత్తి, సోయాల్లో అంతర పంటతో పాటు ప్రత్యేకంగా కందిని పండిస్తారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం కంది పంట సాగు విస్తీర్ణం తొమ్మిది వేల హెక్టార్ల వరకు తగ్గింది. ఈ ఏడాది వానాకాలంలో జిల్లాలో సకాలంలో వర్షాలు కురవడం, వాతావరణం సైతం కంది పంటకు అనుకూలించడంతో పంటి దిగుబడి ఆశాజనకంగా ఉంది. దళారుల బెడద ఎక్కువగా ఉంటోంది. దళారులు గ్రామాల్లోకి నేరుగా వెళ్లి పంటను కొనుగోలు చేస్తారు.

తాజావార్తలు