కడప ఉక్కు ఉద్యమంలో పాల్గొనాలి

కడప,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రాయలసీమ ప్రాంతం అభివృద్ధి, ప్రజలపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు టిడిపి ప్రభుత్వం ముందుకు రావాలని రాయలసీమ అభివృద్ది వేదిక నేతలు అన్నారు. ఉద్యమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవాలని అన్నారు. ఉక్కు పరిశ్రమను నిర్మించడానికి శంకుస్థాపన చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా కడప జిల్లా ప్రజాప్రతినిధులు ఉక్కు పరిశ్రమకు ఉద్యమించాలని… లేకుంటే వచ్చే ఎన్నికల్లో యువత తగిన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ చంద్రన్న పేరుతో ప్రజలను మభ్యపెడుతుందన్నారు. తెదేపా నాయకులకు జిల్లా అభివృద్ధి పట్టడం లేదన్నారు. ఇప్పటికైనా తెదేపా, ప్రతిపక్ష నాయకులు జిల్లా అభివృద్ధికి ఉక్కు ఉద్యమంలోకి రావాలని… లేకుంటే భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు.