కమాండోలు కెమెరాలు తీసుకెళ్లరు!

– 26/11 ముంబయి దాడి సూత్రదారులను వదిలిపెట్టం

– రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన ప్రధాని మోదీ

జైపూర్‌, నవంబర్‌26(జ‌నంసాక్షి) : భారతసైన్యం జరిపిన సర్జికల్‌ దాడులపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోందని, కానీ కమాండోలు కెమెరాలు పట్టుకెళ్లరని మోదీ అన్నారు. రాజస్థాన్‌లో ఎన్నిక ల సందర్‌భంగా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భిల్వారాలోని సోమవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైన్యం జరిపిన సర్జికల్‌ దాడులపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోందని, కానీ కమాండోలు కెమెరాలు పట్టుకెళ్లరని మోదీ అన్నారు. పదేళ్ల క్రితం ఈరోజున ప్రపంచం మొత్తం ఉలిక్కిపడిందన్నారు. లష్కరే ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి ముంబయిలో మారణ¬మం సృష్టించారని విమర్శించారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేడు దేశభక్తి గురించి ప్రసంగాలిస్తోందన్నారు. అంతేగాక.. దేశం గర్వించేలా మేం సర్జికల్‌ దాడులు చేపడితే వాటిని ప్రశ్నిస్తోందని అన్నారు. రుజువులు కావాలని అడుగుతోందని, కానీ ఆపరేషన్‌ చేపట్టే సైనిక కమాండోలు ఆధారాల కోసం కెమెరాలు పట్టుకెళ్తారా?’ అని ఆ పార్టీని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నక్సలైట్లను విప్లవకారులని చెబుతోందని, వారికి ధ్రువపత్రాలు కూడా ఇచ్చిందని ప్రధాని ఆరోపించారు. అయితే అమాయక ప్రజలకు హాని చేస్తున్న ఉగ్రవాదులు, నక్సలైట్లకు తమ ప్రభుత్వం వారి భాషలోనే బదులిస్తోందన్నారు. 26/11 ముంబయి దాడిని భారత్‌ ఎప్పటికీ మర్చిపోలేదని, ఆ దాడికి పాల్పడిన సూత్రధారులను వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ అన్నారు. బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని హావిూ ఇచ్చారు.