కమాన్ పూర్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

జనంసాక్షి, కమాన్ పూర్ :
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమ కోసం పాటు పడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల 15 రోజుల్లో 19 వేల కోట్లు రైతు రుణమాఫీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండలశాఖ ఆధ్వర్యంలో గురువారం కమాన్ పూర్ స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో రైతులతో, ప్రజాప్రతినిధులతో, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం బాణసంచా పేల్చారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా రైతన్నలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించడం అత్యంత సంతోషకరమైన విషయమని అన్నారు. సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయాన్ని తెలంగాణ రాష్ట్ర సిద్ధించాక వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపిన విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆరు నూరైనా రైతన్న సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించేది కేవలం ఒక బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని రాబోయే రోజుల్లో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు