కరీమాబాదులో బుద్ధ వందనం కార్యక్రమం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 10(జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని కరీమాబాద్ అంబేద్కర్ భవనం ముందు అంబేద్కర్ యువజన సంఘం మరియు బి ఎస్ ఐ ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాల ముందు భాద్రపద పౌర్ణమి సందర్భంగా బుద్ధవందనం చేశారు. గౌతమ బుద్ధుని, భారత రత్న అంబేద్కర్, దళిత రత్న కటయ్య , చిత్రపటాల ముందు పూలు చల్లి క్యాండిల్స్ వెలిగించి బుద్ధ వందనము ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో బి ఎస్ ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొమ్మల అంబేద్కర్ , భవన కమిటీ అధ్యక్షులు కడారి కుమార్, పరపతి సంఘం అధ్యక్షులు ఎరుకల మహేందర్, సంఘం కోశాధికారి నీలం మల్లేశం, రామా బాయ్ మహిళా మండలి అధ్యక్షురాలు తరాల రాజమణి, జక్కుల రాజు, భాస్కర్, నరేందర్, రవితేజ సుధాకర్ సురేష్, స్వామి, రవి, గాలి రాజు ,రాజన్ బాబు, నవీన్, రాజు, కళావతి, నవనీత, అనురాధ, మనోహర, సంగీత వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.