కరీమాబాదులో మహా అన్నదాన కార్యక్రమం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 08(జనం సాక్షి )
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ కామన్ పెంట లోని శ్రీ శివాంజనేయ దేవాలయం వద్ద గురువారం వినాయకుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు వినాయకునికి భక్తులు విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పిన్నా మల్లేశం, మల్లురి బాబురావు, కోరబోయిన రాంప్రసాద్, చక్రపాణి, తోటరాజు, ఈగ రాము, షేర్ల కిషోర్, వినయ్, రాజు, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు
Attachments area