కరెంటు బిల్లులు ఫైన్‌ లేకుండా కట్టుకోవచ్చు

– ఏపీ మంత్రి ప్రత్తిపాటి
శ్రీకాకుళం, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల కరెంటు బిల్లులు ఫైన్‌ లేకుండా కట్టుకునే వెలుసుబాటును ప్రభుత్వం కల్పిస్తుంది మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కంచిలి తహశీల్దార్‌ కార్యాలయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విూడియా సమావేశం నిర్వహించారు. డీలర్లు మూడు రోజులు పాటు హేమ్లేట్‌ గ్రామాల్లో (దూర గ్రామాల్లో) నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఆరు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. మత్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. తుఫాన్‌ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సరుకులను అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్డుదారులకు ఖచ్చితంగా సకాలంలో సరుకులు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు ఆయా కుటుంబాల్లో ఆసరాగా ఉపయోగపడుతున్నాయని మంత్రి పుల్లారావు తెలిపారు.

తాజావార్తలు