కరెంటు సమస్యలు..! కన్నీళ్లు మిగిల్చే..!కరెంటు సమస్యలు..! కన్నీళ్లు మిగిల్చే..!

భైంసా రూరల్ ఫిబ్రవరి 16 జనం సాక్షి

– చేతికొచ్చిన పంట చేజారిపోయే..!
– పైసలు దేవలసిన పంట పశువులకు దానయే..!
– ప్రభుత్వ0 ఆదుకోవాలంటూ రైతు ఆవేదన…

ఇటీవల కరెంటు సమస్యలు రైతులకు కన్నీళ్లే మిగిస్తున్నాయి. చేతికొచ్చిన పంట చేజారిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పైసలు తీసుకొస్తాది అనుకున్న పంటలు పశువులకు మేతగా అవుతున్నాయి. తానూరు మండలంలోని బోసి గ్రామంలో మక్క పంటను పండిస్తున్న విఠల్ అనే రైతు కరెంటు సమస్యలతో తన 18 ఎకరాల పంట పొలంలో మక్కా నేలపాలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. తనకున్న 18 ఎకరాల పొలంలో రెండు బోరుబావులను ఏర్పాటు చేసుకొని పంట పండిస్తున్న రైతు… ఇటీవల కరెంటు కోతలు, కరెంటు సమస్యలు తో బోరు మోటార్లు పాడేయ్యి చేతికొచ్చిన పంట నేలపాలయి0ది.ఒక్కోసారి సింగిల్ ఫేస్ అంటూ మరోసారి త్రీ ఫేస్ అంటూ కరెంటు అందిస్తున్న ప్రస్తుత తరుణంలో,మంచిగా పనిచేస్తున్న బోర్లు కాలిపోయి పాడైపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనికి తోడు విద్యుత్ కోతలు కూడా పంట నేల పాడవ్వడానికి కారణమయ్యాయి అంటూ పేర్కొన్నారు. కరెంటు సమస్యలతో నీళ్లు లేక చేతికొచ్చిన పంటలు పశువులకు దానగా అయ్యాయి అంటూ…ప్రభుత్వం మాలాంటి వారిని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలపై తాలూకవ్యాప్తంగా రైతులు ఇప్పటికే ఎన్నో ఆందోళనలు చేశారు. కరెంటు సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ని అందించాలంటూ పలువురు రైతులు కోరుకు0టున్నారు.