కరెంట్‌ పునరుద్దరిస్తుంటే విమర్శలా

ఎంతగా నష్టం జరిగిందో తెలుసుకోరా
పవన్‌ విమర్శలపై ఘాటుగా స్పందించిన యామినీ
అమరావతి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  తిత్లీ బాధిత ప్రాంతాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తూ, ట్విట్టర్‌ వేదికగా, కరెంట్‌ లేని విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై టిడిపి మహిళా నేత సాధినేని యామిని స్పందించారు. ఇప్పటివరకూ తిత్లీ బాధిత ప్రాంతాల్లో కరెంటును ఎందుకు ఇవ్వలేకపోయారన్న విషయమై ఆధారాలతో సహా తాను సమాధానం ఇస్తున్నానంటూ, తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు.  ఇప్పటివరకు కరెంటు ఎందుకు ఇవ్వలేదంటూ పవన్‌ ట్వీట్‌… దానికి ఆధారాలతో సహా సమాధానం ఇచ్చారు. తుఫాను ధాటి కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకునేందుకు నాలుగు గంటల్లోనే చంద్రబాబు తన క్యాబినెట్‌ మొత్తాన్ని పలాసకు మార్చి, అక్కడ నుంచే పరిపాలన చేస్తున్నారు. ఇప్పటికి 7 రోజులయ్యింది. చంద్రబాబు అంతకు ముందు రోజు నుంచే, తుఫాను ప్రభావం గురించి అంచనా వేస్తూ, తగు ఆదేశాలు ఇస్తూ, తుఫాను వచ్చే ముందు రోజు రాత్రి నిద్ర కూడా పోకుండా, అప్రమత్తంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాక, శ్రీకాకుళంలోనే పని చేస్తూ, పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. ప్రభుత్వమే ఇంత ఇదిగా పని చేస్తే, ఇక ప్రతిపక్షం ఇరగబడి పని చెయ్యాలి. కాని మన ఖర్మకు ఒక నాయకుడు హైదరాబాద్‌ పోయాడు, ఇంకో వాడు స్పెషల్‌ ఫ్లైట్లలో తిరుగుతూ, కారులో కవాతులు చేసుకుంటూ, తీరిగ్గా ఆరు రోజుల తరువాత వచ్చాడు. లోపాలు ఉంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో చెప్పాలి.  ఇక ట్విట్టర్‌ వేదికగా రాజకీయ దాడి మొదలు పెట్టాడు. ఇప్పటికి ఆరు రోజులయ్యింది, కరెంటు ఎందుకు రాలేదు అంటూ చంద్రబాబుని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశాడు పవన్‌. నిజానికి, పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడ అవమానించేది చంద్రబాబుని కాదు, గ్రౌండ్‌లో పని చేసే కొన్ని వేల మంది స్టాఫ్‌ ని.. పవన్‌ చౌకబారు ఆరోపణకు, ఆధారాలతో సహా నా సమాధానం ఇది. 20-30 సంవత్సరాల నుండి వేసుకున్న విద్యుత్‌ వ్యవస్థ మొత్తం తిత్లీ దెబ్బకు కకావికలమైపోయింది. 30 వేల కరెంటు స్థంబాలు పడిపోయాయి. విూరొచ్చి ఆరు రోజులైనా పునరుద్ధరించలేదని ఆరోపణలు చేస్తున్నారు. 7 వేల మంది సిబ్బంది రాత్రనకా, పగలనకా, దసరా లాంటి పెద్ద పండగలను, పెళ్ళాం బిడ్డలనొదిలేసి కష్టపడి పనిచేస్తున్నారు. విూరు తీరిగ్గా కవాతులు, బలప్రదర్శనలు పూర్తి చేసుకోని వచ్చి ఒకపూట, ఒక మూల తిరిగి నోటికొచ్చినట్లుగా మాట్లాడతారా అంటూ ప్రశ్నలు సంధించారు. ఇంటికి కరెంట్‌ రావాలంటే ముందు 33 కేవీ లైన్లు, తరువాత 11 కేవీ లైన్లు సరిచెయ్యాలి. ట్రాన్స్‌ ఫార్మర్స్‌, పోల్స్‌ కూడా పడిపోయాయి. వాటిని నిలబెట్టాలి. అప్పుడు ఎల్టీ లైన్లు సరి అవుతాయి. అవి అన్నీ సరి చెయ్యాలంటే ఏదో ఒకటి రెండు రోజుల్లో విూరు సినిమాలో వేసిన సెట్‌ లా
అయిపోదు. ఇప్పటికి దాదాపుగా 85 శాతం కరెంటు ఇస్తున్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతున్నాయి. అవి కూడా మరో, నాలుగు అయిదు రోజులలో పూర్తవుతాయి. విూ రాజకీయ ప్రచారం కోసం, కష్టపడి పని చేసే వారిని, తక్కువ చేసి మాట్లాడకండి. చేతనైతే సహాయం చెయ్యండి. లేకపోతే కవాతులు చేసుకోండని  పవన్‌ ట్వీట్‌పై నిప్పులు చెరిగారు.

తాజావార్తలు