కరెంట్ బిల్లు ఇవ్వడం మరిచారు బషీరాబాద్

కరెంట్ బిల్లు ఇవ్వడం మరిచారు బషీరాబాద్

అక్టోబర్06,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో విద్యుత్ ఉపకేంద్రం నుండి 6వ తేదీకి చేరిన కరెంటు బిల్లు ఇవ్వని విద్యుత్ అధికారులు,గత నెలలో 40 రోజులకు బిల్లు ఇచ్చారని విద్యుత్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి నెల30 రోజులకు కరెంట్ బిల్లు ఇవ్వాలి కానీ అధికారుల నిర్లక్ష్యం వలన 40 రోజులకు కరెంట్ బిల్లు ఇస్తున్నారని అలా ఇవ్వడం వలన యూనిట్లు పెరిగి,ధర కూడా పెరగడం జరుగుతుందన్నారు.ఉదాహరణకు 100 నుండి 200 యూనిట్ల వరకు ఒక ధర ఉంటుంది.201 పెరిగిన 300 యూనిట్లకు నిర్ణయించిన ధర ఈ 200 యూనిట్ల పైన పడుతుంది. అందుకోసమే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని విద్యుత్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్తు ఉన్నత అధికారులు వెంటనే స్పందించి 30 రోజులకు కరెంటు బిల్లు ప్రతి ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.