కల్వర్టును ఢీకొన్న కారు ముగ్గురికి తీవ్ర గాయాలు

కడప,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కడప, చిత్తూరు జాతీయ రహదారిలో సంబేపల్లి వద్ద శనివారం మధ్యాహ్నం జరగిన రోడ్డు ప్రమాదంలో కారు గోతిలో పడింది.  సంబేపల్లి నుండి కలకడకు వెళ్లే జాతీయ రహదారిలో సంబేపల్లికి 400 విూటర్ల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి నుండి కడపకు వెళుతుండగా.. డ్రైవరు నిద్రలోకి జారుకోవడం వల్ల కారు కల్వర్టును ఢీకొని జాతీయ రహదారి పక్కనే ఉన్న గోతిలో పడింది. ఘటనలో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులోని డ్రైవర్‌ సుధీర్‌తో పాటు, వనమ్మ, విూనాక్షమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కున్న ఈ ముగ్గురిని స్థానికులు, పోలీసులు అతి కష్టం విూద బయటకి తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానిక సంబేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు, సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ సయ్యద్‌ హాసం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే 108 అంబులెన్సు అందుబాటులో
లేకపోవడంతో, స్థానిక ఎస్‌ఐ హాసన్‌ చొరవ తీసుకొని క్షతగాత్రులను ఆటోలలో ప్రాథమిక చికిత్స కోసం సంబేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి చెందింది. సంబేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

తాజావార్తలు