కళ్యాణమంటపం ప్రారంభం

విశాఖపట్టణం,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  పెందుర్తి పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆధ్యాత్మికతను నింపేందుకు వేంకటాద్రి వారధిగా నిలుస్తోందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు. వేంకటాద్రిపై రూ. 1.90కోట్లతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆదివారం రాత్రి ఆయన చేతుల విూదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వావిూజీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య సమాజంలో ప్రజా ప్రతినిధుల సహకారంతోనే ఆలయాలు అభివృద్ధి చెందాలన్నారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వేంకటాద్రి అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. ఎంపీ ముత్తంశెట్టి , ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ చినజీయర్‌ స్వామి ఆశీస్సులతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు.

తాజావార్తలు