కష్ట పడితే ఏదైనా సాధ్యమవుతుంది

హైదరాబాద్,ఆగష్టు21(జనంసాక్షి)
కష్ట పడితే ఏదైనా సాధ్యమవుతుందని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి వి సింధు అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా హకీంపేట లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించిన సిఐఎస్ఎఫ్ యొక్క వార్షిక అథ్లెటిక్ మీట్ 2021 ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని అకాడమీ డైరెక్టర్ సివి ఆనంద్ ఐపీఎస్ ప్రారంభించి, అధ్యక్షత వహించారు. కార్యక్రమం వేడుక లాంగ్ మార్చ్ ఫాస్ట్ తో ప్రారంభమై పురుషుల మహిళల విభాగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమంలో 62 యూపీఎస్సీ ద్వారా 62 అసిస్టెంట్ కమాండెంట్ ఆఫీసర్ లు పలు క్రీడలలో పోటీపడ్డారు. విజేతలకు ఆమె పథకాలు అందజేసారు. పీవీ సింధును డైరెక్టర్ సివి ఆనంద్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీలో పాల్గొన్న ప్రతి క్రీడాకారులు విజేత అన్నారు. శిక్షణ పొందిన క్రీడాకారులు అందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు తాముగా విశ్వాసంతో కష్టపడితే విజయం సాధిస్తారని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ అమిత్ శరణ్, సింధు తల్లిదండ్రులు రమణ, విజయ, శిక్షణ, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.