కస్తూరిబా పాఠశాలకు ఎల్ఈడి లైట్ల పంపిణీ
శివ్వంపేట జూలై ..
జనంసాక్షి : మండల పరిషత్ అధ్యక్షులు దివంగత నాయకుడు జిన్నారం పెద్ద గోని అశోక్ కుమార్ గౌడ్ 15 వ వర్ధంతి సందర్భంగా మండల పరిధిలోని గూడూర్ లో గల కస్తూరిబా బాలికల పాఠశాల కు అశోక్ కుమార్ గౌడ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం మండల పరిషత్ అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రమణ గౌడ్, సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదగా పాఠశాల ప్రిన్సిపాల్ మంజుల, సిబ్బందికీ ఎల్ఈడీ లైట్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశం లో ఎంపీపీ హరికృష్ణ, ప్రసాద్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రమణగౌడ్ ట్రస్టు సభ్యులు శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ అనునిత్యం ప్రజాసేవ లో ఉండి, అమరులైన తన తమ్ముళ్ల పెరిటా ట్రస్ట్ లు స్థాపించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు శివ కుమార్ గౌడ్ చేపడుతున్నారన్నారు. అందులో భాగంగా కస్తూరిబా పాఠశాలకు అనేక సేవలు అందించడం జరిగిందని మొన్ననే ట్రస్టు ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పారితోషికం అందించడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రిన్సిపల్ మంజుల విద్యుత్ లైట్స్ సరిగా రాక పాఠశాల లో అందకారంగా ఉన్న విషయాన్ని వివరించగా తక్షణమే స్పందించి అశోక్ కుమార్ గౌడ్ సొసైటీ తరుపున ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఎల్ఈడి లైట్స్ అందించి, సమస్య తీర్చడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య కుమార్ గౌడ్, భిక్షపతి యాదవ్, కే. శ్రీనివాస్ గౌడ్, పోచగౌడ్ నరేందర్, దశరథ్, శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ గౌడ్, శ్రీను, అర్జున్, రాములు, పాఠశాల సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.