కాంగ్రెస్‌, బాజపా మాటల యుద్దం

గౌహతి, నూఢిల్లీ: ఇష్రత్‌ జహాస్‌ ఎన్‌కౌంటర్‌పై సిబిఐ అభియోగపత్రానికి సంబంధించి కాంగ్రెస్‌, బాజపాల మధ్య గురువారం కూడా మాటల యుద్దం కొనసాగింది. ‘ఇష్రత్‌ జహాన్‌ గత చరిత్ర పరిశీలించాలి. ఆమెకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలేమైనా ఉన్నాయేమో పరిశీలించి బహిర్గతపర్చాలి. ‘అని బాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. 2003 కంటే ముందు దేశంలో మూడువేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. రాజకీయ లబ్ది కోసం ఇపుడు ఈ కేసులో రాద్దాంతం చేస్తున్నారు. ఐబికి వ్యతిరేకంగా సిబిఐని ప్రయోగించారు. అని రాజ్‌నాధ్‌సింగ్‌ ఆరోపించారు. రాజ్‌నాధ్‌ ఆరోపణలను కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్రమంత్రి కపిల్‌ సిబల్‌ ఖండించారు. కేంద్రం చెబితే సిబిఐ దర్యాప్తు చేపట్టలేదు. న్యాయస్థానం పర్యవేక్షణ ప్రకారమే దర్యాప్తు చేసింది. ఈ విషయంలో రాజ్‌నాథ్‌ ఆలోచించి స్పందించాలి. సిబిఐని ఉపయోగించుకున్నారని నిలదీసే బదులు గుజరాత్‌ పోలీసులను ఎలా ఉపయోగించుకున్నారని నిలదీయాలి. గుజరాత్‌ చట్టాలు పనిచేయకపోవడంపై ఆందోళన చెందాలి అన్నారు.