కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ప్రారంభం
న్యూఢీల్లీ: కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఆర్థిక సంస్కరణల దిశగా యూపీఏ ప్రభుత్వ ఇటీవల తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. సోనియాగాంధీ అధ్యక్షత వహించే ఈ భేటీకి ప్రధాన కార్యదర్శులు, శాశ్వత సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రధాని మన్మోహస్ సింగ్, రాహుల్ గాందీ సహా పార్టీ అగ్రనేతలంతా హాజరయ్యారు. ఇది సాధారణ సమావేశమే అని ఏఐసీసీ చెబుతున్నప్పటికీ తెలంగాణ అంశం సహా దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై కూలంకషంగా చర్చించడానికి, ప్రధాని తాజాగా అనుసరిస్తున్న ఆర్ధిక సంస్కరణల అజెండాను రాజకీయంగా ఆమోదించడానికే ఈ భేటీ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.