కాంగ్రెస్‌  అధికారంలోకొస్తే పాతపెన్షన్‌పద్ధతి

` పార్టీ పోటీ చేయొద్దంటే చేయను
` మీడియా సమావేశంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): భారాస ఇచ్చిన హావిూల్లో 90 శాతం అమలు చేయలేదని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బుధవారం ఆయన విూడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.’’కాంగ్రెస్‌ వస్తే పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేస్తాం. నేను హుజూర్‌నగర్‌, నా భార్య కోదాడ టికెట్‌ కోసం దరఖాస్తు చేశాం. త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని ఏఐసీసీని కోరతా. టికెట్లు తొందరగా ప్రకటిస్తే ప్రచార వేగం పెంచుతాం.వామపక్షాలతో చర్చలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియదు. హుజూర్‌నగర్‌, కోదాడలో మెజారిటీ 50వేలు కంటే తగ్గదు. 50వేలు కంటే మెజారిటీ తగ్గితే మళ్లీ రాజకీయాలు చేయను. పార్టీ పోటీ చేయొద్దంటే చేయను.ఎంపీ ప్రతిపాదన వస్తే అప్పుడు చూద్దాం. గడిచిన ఆరు నెల్లలో పార్టీ బాగా బలపడిరది. భారాసను దీటుగా ఎదుర్కొంటాం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో క్లీన్‌ స్వీప్‌ చేస్తాం’’ అని ఉత్తమ్‌ అన్నారు.