కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి.

ప్రారంభమైన యూత్ జోడో – బూత్ జోడో..
-యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయుడు.
ఊరుకొండ, సెప్టెంబర్ 30 (జనంసాక్షి):
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకుగాను.. పార్టీకి పట్టుకొమ్మలా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేసి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అందులో భాగంగానే యూత్ జోడో .. బూత్ జోడో కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టడం జరుగుతుందని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయుడు అన్నారు. శుక్రవారం
జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు., తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకాపు శివసేన రెడ్డి సూచనల మేరకు.. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాసు యాదవ్ పిలుపుతో., జడ్చర్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి సమూహానల మేరకు ఊర్కొండ మండలపరిధిలోని రేవల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష మరియు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంఠం విజయుడు అధ్యక్షతన యూత్ జోడో – బూత్ జోడో కార్యక్రమం రేవల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తల సమూహంతో పటిష్టంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయుడు మాట్లాడుతూ.. యాత్ జోడో – బూత్ జోడో కార్యక్రమం ద్వారా
గ్రామస్థాయిలో ఉన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు.. గ్రామ ప్రజలకు అనుసంధాన కర్తలుగా ఉంటూ,, కాంగ్రెస్ పార్టీనీ గ్రామస్థాయిలో బలోపేతం చేయటానికి ఈ యూత్ జోడో – బూత్ జోడో కమిటీ సభ్యులు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో మన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధినీ గ్రామాలలోనీ పేద ప్రజలకు తెలియజేస్తూ,, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విజయుడు, మండల యువజన కాంగ్రెస్ నాయకులు ఆదినారాయణ, రేవల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు గెలవలయ్య, వెంకటయ్య, అల్వాల్ రెడ్డి, జంగయ్య, రసూల్, చంద్రయ్య మరియు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.