కారు ఢీకోని చిన్నారి మృతి

 

నేరేడిగోండ : మండలంలోని బోద్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద ఏడో నెండరు జాతీయ రహదారిపై కారు ఢీకోని జాదవ్‌ మౌనిక (6) మృతి చెందింది. కుంటాల మండలం డౌనెల్లి తాండాకు చెందిన మౌనిక అమ్మమ్మ. తాతయ్యలతో కలిసి నేరేడీగోండ మండలం వాగ్దారి గ్రామంలోని బందువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు దాటుతూ ఈ ప్రమాదానికి గురయింది. నేరేడిగోండ ఎసై కిరణ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు.