కార్ఖానా లో ఎండో రైట్ సూపర్ స్పెషాలిటీ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావు
కార్ఖానా ఓల్డ్ వాసవి నగర్ లో అధునాతన వైద్య పరీక్షలు హాస్పటల్ ఎండో రైట్ సూపర్ స్పెషాలిటీ సెంటర్ ను ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ అమిత్ గోయల్ పేర్కొన్నారు.. కార్ఖానా ఓల్డ్ వాసవి నగర్ లో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ డయాగ్నస్టిక్ సెంటర్ ను ఉపసభాపతి పద్మారావు ప్రారంభించారు.. నూతనంగా నిర్మించిన వైద్య పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.. ప్రజా వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని పేదలకు కొంత మేర ఉచిత సేవలను అందించాలని వారికి సూచించారు.అధునాతన వైద్య పరికరాల తో డయాబెటిక్ థైరాయిడ్ హార్మోన్స్ సంబంధించిన అనేక వ్యాధులకు వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వాటిని ప్రాథమికంగా గుర్తించేందుకు వీలుంటుందని అన్నారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆల్వాల్ ప్రాంతవాసులకు ఈ వైద్య నిర్ధారణ పరీక్ష కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని. ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డాక్టర్ అమిత్ గోయల్ కోరారు. ఈ కార్యక్రమానికి జి సాయన్న, కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సివిలియన్ సభ్యుడు జె. రామకృష్ణ,
బీఆర్ఎస్ నాయకుల తేలకుంట సతీష్ కుమార్, టి.ఎన్ శ్రీనివాస్ ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.