కార్పొరేట్ శక్తులకు సబ్సిడీలు, సామాన్యులకు పన్నుల భారమా.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు దోచుకోవడం దాచుకోవడం పై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు.

పెంచిన  ధరలను తగ్గించాలి,అగ్ని పత్ ను రద్దు చేయాలి.

 కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ.
ప్రధాన కార్యదర్శి అర్థం రవి.
కొల్లాపూర్ నియోజక వర్గ నేత జగదీశ్వర్ రావు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 5(జనంసాక్షి)
కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు పోటీపడిసామాన్య ప్రజల నడ్డి విరిచేలా మోపుతున్న పన్నుల భారాన్ని తగ్గించి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి కొల్లాపూర్ నియోజక వర్గ నేత జగదీశ్వర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ రాష్ట్రంలో కేసీఆర్ లు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ బస్సు మరియు విద్యుత్ చార్జీలను పెంచడం వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యని వెంటనే వాటిని తగ్గించాలని డిమాండ్ చేశారు.కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ దిగ్గజాలకు రాష్ట్రంలో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని కట్టబెట్టి కమిషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు.కార్పొరేట్ శక్తులకు సబ్సిడీలను అందజేస్తూ సామాన్యులకు మాత్రం పన్నుల భారాన్ని మోపుతున్నారని విమర్శించారు.మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రజలకు పంచుతామని ఇచ్చిన హామీ ఏమైందని దేశ రక్షణ కాంట్రాక్ట్ వ్యవస్థలో పెట్టేందుకు మోడీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పాత పద్ధతిలోనే సైనికుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై బిజెపి టీఆర్ఎస్ ప్రభుత్వాలు భయాందోళ నకు గురి చేసే విధంగా కుట్రలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని కోరారు.దోచుకోవడం దాచుకోవడం పై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని విరుచుకుపడ్డారు.ఈ కార్యక్రమంలో నాయకులు రోహిణి గోవర్ధన్ రెడ్డి,రాము యాదవ్, కోటయ్య, మల్లయ్య గౌడ్, అనంతరెడ్డి, భార్గవి తదితరులు ప్రసంగించగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
 
Attachments area