ఎడిట్ పేజీ

సవాళ్లను అధిగమించిన విశ్వాసం !

మనం ఏ పని మొదలు పెట్టినా మోకాలడ్డడం అలవాటు. రాజకీయ పార్టీలకు అయితే ఇక వేరుగా చెప్పాల్సి న పని లేదు. కరోనాకు వ్యాక్సిన్‌ తయారీకి పలు సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు ఇదే తరహా పెదవి విరుపులు మొదలయ్యాయి. మోడీ అంటే పడదు గనక దానిని వ్యాక్సిన్‌ తయారీపై వ్యతిరేకతగా ప్రదర్శించారు. వ్యాక్సిన్‌ తయారయ్యాక … వివరాలు

మత్తుపై యుద్దం ప్రకటించాల్సిందే ! 

ఉభయ తెలుగు రాష్టాల్రతో పాటు దేశంలో గంజాయి, మాదక ద్రవ్యాల వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపుతోంది. మత్తుకు బానిసలు అవుతున్న వారు కొందరైతే మత్తులో యువతను ముంచి వ్యాపారంతో కోట్లు సంపాదించాలనుకునేవారు కొందరు. వీరంతా ఇప్పుడు దేశంలో మూలమూలనా విస్తరించి యువతను చిత్తుచేస్తున్నారు. ఒకప్పుడు పంజాబ్‌కు మాత్రమే పరిమితమై మత్తు వ్యాపారం ఇప్పుడుదేశమంతా విస్తరిం చడం … వివరాలు

ప్రజా వ్యతిరేకతను పట్టించుకోని బిజెపి 

పెట్రో ధరల దాడి కొనసాగుతూనే ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఇంతగా అంటే మోడీ ఏడేళ్ల పాలనలో పెరిగినంతగా ఎప్పుడూ పెరగలేదు. అలాగే గ్యాస్‌ ధరలు కూడా అంతే స్పీడుగా పెరిగి పోయాయి. గ్యాస్‌ ధరలు దాదాపు ఈ ఏడేళ్లలో రెట్టింపు అయ్యింది. అయినా ప్రభుత్వంలో ఎక్కడా కించిత్‌ పాశ్చాత్తాపం కలగడం లేదు. మోడీ … వివరాలు

పాలనా వైఫత్యానికి పరాకాష్ట..విద్యుత్‌ సంక్షోభం ! 

దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం నెలకొనడానికి పాలకుల తీరు, దూరదృష్టి లోపమే కారణమని చెప్పాలి. తెలంగాణ మినహా కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్టాల్రు విద్యుత్‌ ఉత్పత్తిలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయనే చెప్పాలి. ఇక ఎపిని తీసుకుంటే కోతలకు సిద్దంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టి ఇష్టం వచ్చినట్లుగా డబ్బులను పంపిణీ చేస్తూ పోతున్న … వివరాలు

కెసిఆర్‌ విద్యుత్‌ దార్శనికత ! 

దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యుత్‌ సంక్షోభం నెలకొంది. తెలంగాణ తప్ప అంతటా ఆందోళన నెలకొంది. విద్యుత్‌ కొరత నాయకులకు షాక్‌ కొట్టేలా ఉంది. బొగ్గు అలభ్యత కారణంగా ఉత్పత్తి పడిపోయిందని పలువురు సిఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ ప్రజలు మాత్రం నిరంతర విద్యుత్‌తో ఎలాటి చీకూచింతా లేకుండా ఉన్నారు. సిఎం కెసిఆర్‌ దక్షతకు ఇది … వివరాలు

ఆపరేషన్‌ కాశ్మీర్‌ ఇప్పుడే అవసరం ! 

ఆపరేషన్‌ కాశ్మీర్‌ చేపట్టాల్సిన అవసరాన్ని తాజా ఘటనలు గుర్తు చేస్తున్నాయి. అక్కడ 370 ఆర్టికల్‌ రద్దు చేయడం కాదు..ఉగ్రవాదులను ఏరివేయాలి. ఇల్లిల్లూ గాలించి కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి వివక్షా ఉండరాదు. పాక్‌తో సహా తాజాగా తలిబన్ల సహాయంతో కాశ్మీర్‌లో ఊచ కోతలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను, వారికి ఊతమిస్తున్న, ఆశ్రయమిస్తున్న వారిని … వివరాలు

కెసిఆర్‌ ఆవేదన కనువిప్పు కావాలి !

భారత దేశంలో మూడో ప్రత్యామ్నాయం పేరుతో రాజకీయ సవిూకరణాలు జరగడం ఇప్పడే కొత్తకాదు. గతంలో జరిగిన పలు ప్రయత్నాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయి. తాజాగా రైతుల సమస్యలపై, రైతు చట్టాల ద్వారా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు పోరాడుతున్నాయి. తాజాగా సిఎం కెసిఆర్‌ మరోమారు అసెంబ్లీ వేదికగా కేంద్రంపై పోరాడుతామని ప్రకటించారు. కేంద్రం వివక్షతపై ఘాటుగానే … వివరాలు

అధికారుల తీరు కళంకితం కారాదు ! 

ప్రభుత్వం అన్నది శాశ్వతం.. అధికారులు..రాజ్యాంగం….నిబంధనలు..విలువలు అన్నవి కూడా శాశ్వతంగా ఉండాల్సిందే..పార్టీలు కొత్తగా అధికారంలోకి రావడం అన్నదే ప్రతి ఐదేళ్లకోమారు జరిగే ప్రక్రియ. ప్రజలు తమ తీర్పు ద్వారా కొత్తవారిని ఎన్నుకోవడం…కొత్తవారు అధికారంలోకి రావడం జరుతోంది. కేంద్రరాష్టాల్ల్రో ఇదే ప్రక్రియ ఉంటుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పకుంటున్న భారతదేశంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడల్లా విలువలు … వివరాలు

కమలనాధుల ఉత్తరకుమార ప్రగల్భాలు 

మోడీ సాధించిన అభివృద్ది మా నినాదం.. మా ఉత్తమ పురుషుడు మోడీ..అవే మా ప్రచారాస్త్రాలు అంటూ తెలుగు రాస్ట్రాల్లో బిజెపి నేతలు ఫీుంకారాలు చేస్తున్నారు. ఇవే తమ ఎన్నికల నినాదాలని..వచ్చే ఎన్నికల కోసం ఇపపటినుంచే ముందే కూస్తున్నారు. రెండు తెలుగు రాష్టాల్ల్రో పాగా వేస్తామని కూడా ధీమా పలుకులను పలుకుతున్నారు. డాంబికాలకు కూడా ఓ హద్దుండాలి. … వివరాలు

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం

కరోనా లాక్‌డౌన్‌తో పారిశుద్ధ్యానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ మామూలు స్థితికి వచ్చారు. మంచి అలవాటు అలాగే కొనసాగిస్తారని, మంచికి అలవాటు పడతారిన భావించారు. అయితే అదంతా తాత్కాలిక మే అఇ రుజువు చేస్తున్నారు. కరోనా భయం వెన్నాడడంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. చేతులు కడుక్కోవడం,ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చేశారు. కానీ మళ్లీ యధాతథస్థితికి … వివరాలు