కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పుష్కరాల కోసం రెండొందల కోట్లను కేటాయించామన్నారు . రెండు నెలల్లో పుష్కరఘాట్లు పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో పుష్కరాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సమైక్యరాష్ట్రంలో గోదావరి పుష్కరాలంటే రాజమండ్రిలోనే జరగాలనే అపోహకలిగించారన్నారు మంత్రి.