కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు..
` ప్రతీ వార్డులో నిర్దేశిత స్థలాల్లోనే అందుకు ఏర్పాట్లు చేయాలి
` వీధికుక్కల బెడదపై సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢల్లీి,ఆగస్ట్22(జనంసాక్షి): వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. వీధులు లేదా బహిరంగ ప్రదేశాల్లో వీటికి ఆహారం అందించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు నిర్దేశిత ప్రాంతాల్లోనే ఆహారం అందించాలని, ఇందుకోసం అధికారులు ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆ ప్రాంతాల్లో మాత్రమే ఆహారం అందించాలని సూచిస్తూ నోటీసు బోర్డులు ఏర్పాటు-చేయాలని వెల్లడిరచింది. దీనిని ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. వీధి కుక్కల బెడదను తగ్గించే క్రమంలో సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీధుల్లో కుక్కలకు ఆహారం ఇవ్వకూడదని, ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియంత్రణ లేకుండా ఆహారం ఇవ్వడం వల్ల అవాంఛనీయ ఘటనలు చోటు-చేసుకుంటున్నాయని వచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకొని ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు- చెప్పింది. సామాన్య పౌరులు వీధుల్లో నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటు-వంటి పద్ధతికి స్వస్తి పలకాలని అభిప్రాయపడిరది.దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలంటూ ఆగస్టు 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటి దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తంచేసిన ద్విసభ్య ధర్మాసనం దిల్లీలో అవి ఎక్కడా కనిపించ డానికి వీల్లేదని, వీటిని షెల్టర్లకు తరలించాలని తీర్పు చెప్పింది. ఈ ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈసందర్భంగా రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 11న ఇచ్చిన తీర్పును సవరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.
పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం
భద్రతా సిబ్బంద కళ్లుగప్పి గోడదూకిన ఆగంతకుడు
వెంటనే అప్రమత్తం అయిన పట్టుకున్న సిబ్బంది
న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌లోని భద్రతా సిబ్బంది వైఫల్యం మరోసారి బహిర్గతమైంది.ఓ ఆగంతకుడు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి చొరబడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. అతడిని అదుపులోకి తీసుకుంది. శుక్రవారం ఉదయం ఒక వ్యక్తి రైలు భవనం వైపునున్న చెట్టు ఎక్కి.. కొత్త పార్లమెంట్ భవనంలోని గరుడ గేట్ వద్ద కిందకి దూకి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చూసి.. అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పార్లమెంట్ భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించి.. విచారిస్తున్నారు. పార్లమెంట్ వర్షా కాల సమావేశాలు ముగిసిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ సమావేశాలు ఆగస్టు 21వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే. గత ఏడాది సైతం ఈ తరహా ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి పార్లమెంట్ గోడ దూకి అనెక్స్ భవనం ఆవరణలోకి ప్రవేశించాడు. షార్ట్స్, టీ షర్ట్ ధరించిన ఆ యువకుడిని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పట్టుకున్న వీడియో సోషల్ విూడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అతడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీష్‌గా గుర్తించారు. అతడి వద్ద ఎటువంటి ఆయుధాలు లభ్యం కాలేదు. అయితే అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. ఇక రెండేళ్ల క్రితం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ.. లోక్‌సభలో పబ్లిక్ గ్యాలరీలో కూర్చొన్న ఇద్దరు యువకులు ఆ తర్వాత సభలో దూకి సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారు. లోక్‌సభలోని పబ్లిక్ గ్యాలరీ వద్ద కూర్చొన్న ఇద్దరు యువకులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను వదిలి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు ఇదేరకమైన నిరసనను చేపట్టారు. ఈ ఘటన తర్వాత పార్లమెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటన పార్లమెంట్‌లోని భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టింది. అనంతరం పార్లమెంట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 2001, డిసెంబర్ 13వ తేదీ పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. ఈ అంశంపై చర్చ జరుగుతున్న రోజే.. ఈ ఆగంతకులు సభలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించడం గమనార్హం. గతేడాది ఆగస్టులో కూడా ఈతరహా ఉల్లంఘన చోటుచేసుకుంది. ఓ యువకుడు పార్లమెంట్ గోడ దూకి లోపలికి చొరబడేందుకు యత్నించాడు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీశ్‌గా పోలీసులు గుర్తించారు. అప్పుడు నిందితుడి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అప్పట్లో పోలీసులు వెల్లడిరచారు.