కులాలతో రాజకీయం చేయడం సరికాదు..!
మంథని, (జనంసాక్షి) : కులాలతో రాజకీయం చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపిటిసి కుడుదుల వెంకన్న అన్నారు. అలాగే మంథని మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటిగా చేయడంతో ఉపాధి హామి పనులు రద్దు కావడంతో మంథనిలో మున్నూరు కాపులకు ఉపాధి లేకుండా పోయిందని పేర్కొన్నారు. మంథని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో తన పై దాడి చేసిన నాయకులు ఇప్పుడు దాడి చేయలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. రూ. 20 లక్షలు ఇస్తామని నన్ను భారాసలోకి రమ్మని ఆఫర్ చేశారని తాను మాత్రం పార్టీ మారలేదన్నారు. కాంగ్రెస్ యువజన విభాగం మండల పార్టీ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్ మాట్లాడుతూ.. ఖాన్సాయిపేటలో జరిగిన సమావేశంలో భారాస నాయకులు శ్రీధరబాబు అగ్ర కులానికి చెందినవాడని కులాన్ని అంటగట్టడం సరియైంది కాదన్నారు. ప్రజల ప్రేమ విశ్వాసం ఉండడంతోనే శ్రీపాదరావు, శ్రీధరాబాబులు పలు మార్లు మంథని నియోజకవర్గంలో గెలుపొందారన్నారు. బీసీ, ఎస్సీ, మైనా బంధులు నిరుపేదలకు ఇవ్వకుండా పార్టీ కార్యకర్తలకే ఇచ్చారన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల ఎస్సీ, బీసీలు తీవ్రంగా నష్టపోయారన్నారు. శ్రీధరబాబు కులాల గురించి పట్టించుకోకుండా అసెంబ్లీలో అనగారిన వర్గాలకు సహాయం అందించాలని అసెంబ్లీలో కోరడం జరిగిందన్నారు. ప్రజలు వాస్తవాన్ని గ్రహించి ఎన్నికల్లో తగిన తీర్పునిస్తారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పర్వతాలు యాదవ్, కూర కోటేష్ తదితరులు పాల్గొన్నారు