కుల మత వర్గ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు
– ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ హుజూర్ నగర్ సెప్టెంబర్ 30( జనంసాక్షి): భారత రాజ్యాంగం ప్రకారం సమాజంలో కుల, మత, వర్గ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని ఎస్సీ కాలనీలో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీవాసులు గతంలో నిరుపేదలైన ఎస్సీలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల నిర్మాణానికి ఇండ్ల పట్టాలు ఇచ్చిన నేటి వరకు స్థలం ఎందుకు ఇవ్వలేదని రెవిన్యూ అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి ఈ విషయంపై మాట్లాడి అర్హులందరికీ న్యాయం జరిగేలా చూస్తానన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని హక్కులు ప్రతి ఒక్కరు ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సుధారాణి, ఆర్ ఐ పోటు సూర్యనారాయణ, వార్డు సభ్యులు జొన్నలగడ్డ నాగరాజు, కందుకూరి నరసింహ, మెరుగు మట్టపల్లి, కాలనీవాసులు పాల్గొన్నారు.