కూకట్ పల్లిలో ఉదాసిన్ మఠామ్ భూమి
ఈ భూమిలో ప్రజలకు ఉపయోగపడే సదుపాయాలు కల్పిస్తాం… పీఠాధిపతులు అగర్ దాస్, అరుణ్ దాస్….
కూకట్ పల్లి, జనంసాక్షి :
కూకట్ పల్లిలో ఉన్న ఉదాసీన్ మఠానికి చెందిన 540 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి ఇక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నికి ఎట్టి పరిస్థితులలో ఉపయోగించబోమని ఉదాసీన్ మఠానికి చెందిన ప్రతినిధులు అగర్ దాస్, అరుణ్ దాస్ లు మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఋషులు తపస్సు చేశారు కాబట్టి ఈ ప్రాంతానికి ఋషికొండ అని పేరు వచ్చిందని తెలిపారు. 540 ఎకరాలలో సమాజానికి ఉపయోగపడే విధంగా విద్య, వైద్యం, దేవాలయాలు, ఆశ్రమాలతో పాటు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతాని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటికి సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నామని త్వరలోనే భూమి పూజ కూడా చేస్తామన్నారు. 540 ఎకరాలకు సంబంధించి పూర్తిస్థాయి సర్వే కొనసాగుతుందని భూమి కబ్జా కాకుండా అనుక్షణం పహారకాస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.