కృష్ణా నీటికేటాయింపులు
– ఏపీకి 16.. తెలంగాణకు 6 టీఎంసీలు
– త్రిసభ్య కమిటీ నిర్ణయం
హైదరాబాద్,సెప్టెంబర్ 22,(జనంసాక్షి): కృష్ణా జలాల కేటాయింపులు, నీటివిడుదల, పరస్పర ఫిర్యాదులపై చర్చించేందుకు జలసౌధలో శుక్రవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరు తెలుగు రాష్టాల్రు తాగునీటి అవసరాల కోసం నీటిని వాడుకునేందుకు బోర్డు అనుమతించింది. ఇందుకుగాను ఆంధ్రప్రదేశ్‌కు 16టీఎంసీలు, తెలంగాణకు 6 టీఎంసీలు నీటిని వాడుకోవచ్చని తెలిపింది. బోర్డు అనుమతి తర్వాతే జలాలు విడుదల చేయాలని త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. ఏపీకి కేటాయించిన 16 టీఎంసీలలో హంద్రీనివాకు ఐదు టీఎంసీలు, పోతిరెడ్డిపాడుకు ఐదుటీఎంసీలు, కుడికాలువకు ఆరుటీఎంసీలు వాడుకోవాలని సూచించింది. అదేవిధంగా తెలంగాణకు కేటాయించిన 6 టీఎంసీలలో కల్వకుర్తికి 4టీఎంసీలు, నల్గొండకు 1, హైదరాబాద్‌కు 1చొప్పున టీఎంసీలను వాడుకోవచ్చని బోర్డునిర్ణయించింది. నాగార్జున సాగర్‌లో 510 అడుగుల, శ్రీశైలంలో 854అడుగులు నీటిమట్టాన్ని మెయింటెన్ చేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ సమావేశంలో తెలంగాణ త్రిసభ్య కమిటీ సభ్యుల ఎదుట తమ వాదనను వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిందని, అనుమతి లేకుండానే రెండు సార్లు నీటిని విడుల చేసుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సైతం తెలంగాణ ప్రభుత్వంపై పలు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు విన్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కార్యదర్శి సవిూర్ చటర్జీ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్వహణపై బోర్డు వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, కామన్ ప్రాజెక్టులను మాకు అప్పగించలేదని, ఎలా నియంత్రింగలమని తెలిపారు. తుంగభద్ర బోర్డుకు ఉన్నట్లు మాకు అధికారం లేదని తెలిపారు. వచ్చేనెల 15న మరోసారి పూర్తిస్థాయి సమావేశం నిర్వహిద్దామని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి సవిూర్ ఛటర్జీ, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ నెల 27న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమం/-రతి కేసీఆర్‌లు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇరు రాష్టాల్ర మధ్య నెలకొన్న పలు సమస్యలను చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు, నీటి వాటాల పంపకంపైనా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.




