కెటిఆర్‌తో మెక్రాన్ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్,సెప్టెంబర్17(జనంసాక్షి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను మైక్రాన్ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్లు స్టీఫెన్ డ్రేక్, అమ్రిందర్ సిద్దు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై మైక్రాన్ సంస్థ ప్రతినిధులు.. కేటీఆర్‌తో చర్చించారు. రాష్ట్రంలో రూ. 300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది మైక్రాన్ సంస్థ. వెయ్యి మంది ఇంజినీరింగ్, ఐటీ నిపుణులకు అవకాశం కల్పించనుంది ఈ సంస్థ. మైక్రాన్ సంస్థ డైరెక్టర్లకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.