కెసిఆర్‌ వ్యూహాలకు దీటుగా కూటమి ప్రచారం

యుద్దం చేసేవాడు తానే గెలుస్తానన్న నమ్మకం,ధైర్యం ఉంటేనే కదనరంగంలోకి దూకుతాడు. అందుకే విజయం తననే వరిస్తుందని సైన్యానికి ధైర్యం నూరిపోస్తాడు. అవతలిపక్షం బలహీనతలను ప్రధానంగా చర్చిస్తారు. అవతివారు ఎంత అన్న లెవల్లో ఉంటారు. నునాయకుడు ధైర్యంగా లేడనో..వీక్‌గా ఉన్నాడనో కనిపిస్తే సైన్యం కూడా నీరుగారిపోతుంది. అప్పుడు యుద్దంలో గట్టిగా పోరాడలేక చతికిల పడతారు. అందుకే నాయకుడు ముందు ధైర్యంగా కదలాలి. ఎన్నికల రణక్షేత్రంలో కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు కెసిఆర్‌ కూడా అదే ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. తను కోరితెచ్చుకున్న ఎన్నికల్లో గెలవాలంటే తనను నమ్ముకుని వెంట ఉన్నవారిలో ధైర్యం నూరిపోయాలి. అందుకే వందకుపైగా సీట్లలో గెలుస్తామని మరోమారు నమ్మబలికారు. అందరికి బి.ఫామ్స్‌ ఇచ్చేసి యుద్దంలో గెలిచి రావాల్సిందిగా దిశానిర్దేశం చేశారు. మొత్తంగా ఇప్పుడు ఎక్కడా అభ్యర్థులను మార్చేది లేదన్నది కూడా ప్రస్ఫుట మయ్యింది. గతంలో ప్రకటించిన నేతలే ఎన్నికలో బరిలో ఉంటారు. అసమ్మతి నేతలను గతంలోనే మొగ్గలో తుంచేశారు. తానొక్కడినే అంతా గెలిపిస్తానని కూడా భరోసాతో కెసిఆర్‌ ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్‌ కూటమి కూడా అందుకు దీటుగానే ప్రచారంలోకి దిగుతోంది. సీట్లు ఖరారు కాకున్నా ప్రజల్లో కూటమి పట్ల ఆసక్తి పెంచింది. కెసిఆర్‌ గడీల పెత్తనంపైనే ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. అందుకే ఇరుపార్టీల నేతలు

మందీమార్బంలంతో ప్రచార హంగును ఇప్పటికే కొనసాగిస్తున్నారు. ఊరూవాడా ధూంధామ్‌గా ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. ఇక టిఆర్‌ఎస్‌ కకులసంఘాల విూటింగ్‌లు పెట్టడం, వారికి భోజనాలు పెట్టించడం గత రెండు నెలలుగా ప్రతినియోజకవర్గంలో సాగుతోంది. దీనికితోడు ప్రధానంగా విమర్శలకు సంబంధించి కొన్ని అంశాలను ఎత్తుకున్నారు. అందులో ప్రధానంగా కూటమిని విమర్శించడం..కూటమితో చంద్రబాబు కలవడాన్ని విమర్శించడం. కోదండరామ్‌ లాంటి వాళ్లు నాలుగైదు సీట్లకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని చెప్పడం..చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని చెప్పడం.. చేస్తున్నారు. అసెంబ్లీ రద్దు చేసి, అభ్యర్థులను ప్రకటించిన తరవాత గత రెండు నెలలుగా టిఆర్‌ఎఎస్‌ ఇవే అంశాలను ప్రధానంగా ప్రచారం చేస్తోంది. తాము చేపట్టిన అభివృద్ది పనులను వివరిస్తూనే చంద్రబాబును బూచిగా చూపి విమర్శలు చేయడం ద్వారా సెంటిమెంట్‌ను రగిల్చి లబ్ది పొందాలని చూస్తున్నారు. తెలంగాణలో 2014 ఎన్నికల ముందున్న సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించాలన్నది కేసీఆర్‌ వ్యూహం. ఈ కారణంగానే చంద్రబాబు నాయుడును టార్గెట్‌గా చేసుకొని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే కరెంట్‌ రాదన్నది ప్రధనా ప్రచారాశంగా మారింది. నిరతంర విద్యుత్‌ నిలిచిపోతుందన్న ఆరోపణ చేస్తున్నారు. రైతు పథకాలు ఆగిపోతాయని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రధానంగా తెలంగాణ ఏర్పడకుండా అడ్డంపడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనపై పెత్తనం చేస్తారని ప్రచారం ఉధృతం చేశారు. అందుకే తెలంగాణ అభివృద్ది నినాదాలతో ముందుకు పోవాలనుకున్న కెసిఆర్‌ ప్రధానంగా ఇప్పుడు మారిన రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను, చంద్రబాబును కలసి తిట్టడం ద్వారా సెంటిమెంట్‌ అంశాన్ని బలంగా తీసుకుని వెళుతున్నారు. మహా కూటమిని ఆత్మరక్షణలోకి నెట్టడానికై ఈ నినాదాలను తాజాగా తెరపైకి తెచ్చింది. నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వదిలిపెట్టి స్వీయ పాలన, స్వాభిమానం తెరపైకి తేవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పకడ్బందీ వ్యూహ రచనతో ముందుకు వెళుతున్నారు. ఈ నినాదాల ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించాలన్నది కేసీఆర్‌ ఆలోచనగా కనిపిస్తున్నది. దీనికి తోడు రైతులకు మళ్లీ లక్ష రూపాయల వంతున రుణమాఫీ

చేస్తామనీ, పింఛన్‌ మొత్తాన్ని రెట్టింపు చేస్తామనీ, నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు చెల్లిస్తామనీ మధ్యంతర ఎన్నికల ప్రణాళికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఓ వైపు సంక్షేమ పథకాలతో జనాన్ని బుట్టలో వేసుకోవడంతో పాటు ఎదుటి వారి బలహీనతలను బలంగా ప్రచారం చేయాలని చూస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరూ తమ ఎన్నికల ప్రచారంలో వాటి గురించి ప్రస్తావించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇవే వరాలను ప్రకటించడంతోపాటు రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో కొత్తగా ప్రకటిస్తున్న వరాల వల్ల లాభం లేదను కున్నారేమో గానీ.. సెంటిమెంట్‌పైనే ఆధారపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తున్నది. మహా కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెత్తనం చేస్తారని టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు. కూటమి నేతలు కూడా సెంటిమెంట్‌నే ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. కెసిఆర్‌ బలహీనతలతో పాటు ఇన్నాళ్ల పాలనా వైఫ్యలాలను బలంగా ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగం ఇందులో ప్రధాన పాత్ర పోషించబోతున్నది. కాంగ్రెస్‌ విజయావకాశాలను మెరుగుపర్చుకుందన్న వార్తలు క్షేత్రస్థాయిలో రావడంతో ఆ పార్టీలో ఆశావహులు పెరిగిపోతున్నారు. ఫలితంగా పలువురు రెబల్స్‌గా బరిలో నిలిచే ప్రమాదం ఉంది. గాంధీభవన్‌ ముందు హంగామాలు నడుస్తున్నాయి. కెసిఆర్‌ దొరల పాలనను తరిమి కొట్టాలన్న పిలుపుతో ముందుకు సాగుతున్నారు. కెసిఆర్‌పై బలంగానే విమర్శలు చేయడం ద్వారా ముందుకు దూసుకుని పోతున్నారు. ముందే ఎందుకు ఎన్‌ఇనకలకు వెళ్లారో చెప్పాలని నిలదీస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రచారంలో కెసిఆర్‌కు దీటుగా కూటమి నేతలు రాటుదేలారు.