కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాల అభివృద్ధికేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాల అభివృద్ధి – బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి
చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 15 : కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి అన్నారు. ప్రజాగోష-బిజెపి భరోసా స్ట్రీట్ కార్నర్ సమావేశంలో భాగంగా చుంచనకోట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలతోనే గ్రామాలన్నీ బాగుపడుతున్నాయి కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఈ గ్రామాలకు ఇచ్చిన దాఖలాలు లేవని, కేంద్ర ప్రభుత్వ నిధులే దొడ్డిదారిన తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న ఘనత కెసిఆర్ కు దక్కిందని,ఈ చుంచనకోట గ్రామంలో సిసి రోడ్ నుండి స్మశాన వాటిక వరకూ కేంద్ర ప్రభుత్వం వీటిని నిర్మించడం జరిగిందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క అవినీతి మరక లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనత మోడీకే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలంగాణ ప్రజలను రోజుకో మాయమాటలు చెబుతూ అవినీతి పాలన సాగిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్,బూత్ అధ్యక్షులు వడ్లకొండ వెంకటేష్, కమలేష్, బిజెపి చేర్యాల మండల అధ్యక్షులు కాశెట్టి పాండు, బిజెపి సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి నర్ర మహేందర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి,మాజీ ఎంపీపీ తోకల ఉమారాణి, బిజెపి చేర్యాల పట్టణ అధ్యక్షులు కాటం సురేందర్, బిజెపి సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు దండ్యాల లక్ష్మారెడ్డి, బిజెపి సిద్దిపేట జిల్లా ఆర్మీ సెల్ కన్వీనర్ బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.