కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

కేంద్రంలోని మతోన్మాద శక్తులను

రాష్ట్రంలో  నియంతృత్వ పాలననుకొనసాగిస్తున్న పాలకులను గద్దె దించడమే లక్ష్యంగా

 పార్టీ కార్యకర్తలు కృషి  చేయాలి

సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

టౌన్ జనం సాక్షి
కేంద్రంలోని మతోన్మాద శక్తులను రాష్ట్రంలో  నియంతృత్వ పాలననుకొనసాగిస్తున్న పాలకులను గద్దె దించడమే లక్ష్యంగా

 పార్టీ కార్యకర్తలు కృషి    చేయాలని సంగారెడ్డి -సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా తృతీయ  మహాసభ టీఎన్జీవో భవన్ లో సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో    మహా సభను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు  హాజరై మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి కేంద్రంలో పాలిస్తున్న ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మతోన్మాద శక్తులను ప్రేరేపిస్తూప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారు అని విమర్శించారు పేద మధ్యతరగతి ప్రజలు నిత్యం వాడి నిత్యావసరాల పాలు పెరుగు బియ్యం నూనె పప్పు దినుసుల పై  జిఎస్టి ను అమాంతం పెంచుతూ ధనికులు వాడే వజ్రాల పై జిఎస్టి ను తగ్గించడంలో ఆంతర్యమేమిటి అనికూనంనేని సాంబశివరావు  ప్రశ్నించారు ప్రభుత్వ పరమైన ఇటువంటి సంస్థలను ప్రైవేటు చేస్తూ ఉద్యోగాల కల్పన ఎలా కల్పిస్తారు అని ప్రశ్నించారు అగ్నిపత్ పేరిట దేశ రక్షణ తూట్లు పొడుస్తున్నాడు ఇది కాదా దేశద్రోహం అని అన్నారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కొనసాగుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చే అప్రజాస్వామికంగా పరిపాలిస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు పేద ప్రజల వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి నిరుద్యోగ యువతకు వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలితక్షణమే రైతులకు   రుణ మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుసిపిఐ రాష్ట్ర నాయకులు వి ప్రకాష్ రావు గారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు అధికారం లేకున్నా నిత్యం పేద మధ్యతరగతి ప్రజల కొరకు శ్రమిస్తూ పేద ప్రజల సమస్యలపరిష్కారానికై పోరాటాలు నిర్వహిస్తున్నారు  ఈ మహసభలోఐ టి సి రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ , సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్  ,సంగారెడ్డి  జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్, ఎం ఏ రెహమాన్, తాజుద్దీన్, షఫీ హైమద్,  బాల్ రెడ్డి,  బోయిన్ ప్రసాద్, మహబూబ్ ఖాన్, నరేందర్ రెడ్డి, వజీర్బేగ్ , రుబీనా, సునిత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు