కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలి
వీరన్నపేటలో సీపీఐ మహాసభలు, జెండా ఆవిష్కరణ
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
చేర్యాల (జనంసాక్షి) జులై 20 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజా పోరాటాల ద్వారా గద్దె దించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని వీరన్నపేట సీపీఐ గ్రామ శాఖ 3వ మహాసభల సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జూకంటి చంద్రం అధ్యక్షతన జరిగిన మహాసభలో వారు మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో నాడు భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం దొర, జమిందార్ జాగిర్ధర్, దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా పోరాటాల నిర్వహించి నిజాం రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర సీపీఐకి మాత్రమే దక్కిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి 10లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేసి, 4వేల ఐదు వందల మంది ప్రాణం త్యాగం చేశారన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలల్లో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆ స్పూర్తితో నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని, ఎన్నికల వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించడంతో పాటు అధిక ధరలు, పన్నుల భారాన్ని పెంచుతూ రెండు ప్రభుత్వాలు దోపిడీ చేసి ప్రజల రక్తాన్ని పీల్చుకుతుంటున్నాయని ఎద్దేవ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి గద్దె దించేంతవరకు ఉద్యమించాలన్నారు. అనంతరం నూతన గ్రామ శాఖను ఎన్నుకున్నారు. గ్రామ కార్యదర్శిగా పొన్నబోయిన మహేందర్, సహాయ కార్యదర్శులుగా పోకల కనకయ్య, మ్యాక ఎల్లయ్య, కోశాధికారిగా జూకంటి చంద్రం, కార్యవర్గ సభ్యులుగా మ్యాక శ్రీకాంత్, పొన్నబోయిన శ్రీనివాస్, దండెబోయిన వెంకటేష్, పొన్నబోయిన కనకయ్య, పబ్బల్ల