కేజీకెఎస్ పోరాట ఫలితంగానే ట్యాపింగ్ టెస్టుల నిర్వాహణ

– కెజీకెఎస్ జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ కుమార్
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 11 : కల్లు గీత కార్మిక సంఘం పోరాట ఫలితంగానే గీత కార్మికులకు ట్యాపింగ్ టెస్టులు నిర్వహించారని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సవత్సరాలు గడుస్తున్నా గీత కార్మికులకు ట్యాపింగ్ టెస్టులు నిర్వహించకుండా నూతన లైసెన్స్ లు ఇవ్వాల్సిన ఆబ్కారీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలు ఆందోళనలు, జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేసిన ఫలితంగానే వెంటనే స్పందించిన అధికారులు గురువారం దరఖాస్తు చేసుకున్న కల్లు గీత కార్మికులకు చేర్యాల పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద అర్హులైన గీత కార్మికులందరికీ ట్యాపింగ్ టెస్టులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘనత కల్లు గీత కార్మిక సంఘంకే దక్కుతుందన్నారు. ఈ ట్యాపింగ్ టెస్టు లు నిర్వహణకు సహకరించిన జిల్లా ఆబ్కారీ సూపరింటెండెంట్ శ్రీనివాస మూర్తి, చేర్యాల ఆబ్కారీ సీఐ మహేంద్ర కుమార్, ఎస్.ఐలు వినోద్,సురేష్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెజీకెఎస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మేరిండ్ల శ్రీనివాస్,మండల నాయకులు తాళ్లపల్లి కనకయ్య, నాచగొని శ్రీనివాస్, ఆరేళ్ళ కరుణాకర్, ఆరేళ్ళ సాగర్, సుంకరి రమేష్, బత్తిని శ్రీనివాస్, శ్రీనివాస్, కనకరాజ్,నరేష్, విజయ్ కుమార్,ఉత్కం అజయ్, శేఖర్,బోలుగంశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.