కేరళ బాధితులకు వరంగల్ విద్యార్థిని చేయూత
వరంగల్,ఆగస్ట్21(జనం సాక్షి): అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కాట పిలుపుమేరకు కేరళ బాధితులకు సహాయం చేసేందుకు ఓ చిన్నారి ముందుకు వచ్చింది. వరంగల్‌లోని కిండర్లాండ్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న రిదాఅఫ్రీన్ తన తల్లిదండ్రులతో కలిసి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి నాలుగు క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర సరుకులను కలెక్టర్‌కు అందజేసింది. విద్యార్థినిని కలెక్టర్ అభినందించి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేరళకు వంద వంద క్వింటాళ్ల బియ్యాన్ని పంపేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. నవసత్త విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దుస్తులు సేకరించి కలెక్టర్ ద్వారా కేరళకు పంపారు. వరంగల్ సినిమా థియేటర్స్ యాజ మాన్యం ఆధ్వర్యంలో రూ. లక్ష, ఎవరికి తోచిన విధంగా సహాయం చేసేందుకు ముందుకు రావ డం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.