కేసీఆర్ కు ఓటు వేసే వరికే దళిత బంద్.
-సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వాక్యలు.
కొమురవెల్లి, జనం సాక్షి
తెలంగాణలో త్రాగు నీళ్ళతో, 24 గంటల కరెంట్ తో, పెన్షన్తో గానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ప్రసూతితో లబ్దిపొంది కేసీఆర్ కు ఓట్లు వేసే వారికే దళిత బంధు ఇస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వాఖ్యానించారు. బుధవారం కొమురవెల్లిలో ఎంపీపీ తలారి కీర్తన అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా రాంసాగర్ గ్రామ సర్పంచ్ తాడూరి రవీందర్ తమ గ్రామానికి దళిత బంధు రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకోనివెళ్ళగా తెలంగాణ సోయి ఉన్నవాళ్లు గ్రామంలో ఉంటే వాళ్ల పేర్లు పంపించమని చెప్పి తెలంగాణ సోయి ఎందుకు ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు నీళ్లు, కరెంటు, లేవని ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నదని, వాటితో పాటు సంక్షేమ పథకాలలో భాగంగా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా ప్రసూతితో పాటు, కెసిఆర్ కిట్టు ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఇంటికి మంచి నీళ్ళు, 24 గంటలు కరెంట్ పొంది, పెన్షన్ అందిస్తూ ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తెలంగాణ సోయి ఉండి కేసీఆర్ కే ఓటు వేసే వాళ్లకు దళిత బంధు అమలు చేస్తామని, ఇందులో ఎలాంటి దాపరికం లేవని అన్నారు. అనంతరం మండలంలో బెల్టు షాపుల ను బంధు చేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. మండల సభలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను సర్పంచ్లు, ఎంపీటీసీ ఆయా గ్రామాలలోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొని రాగా వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. అనంతరం రాసులాబాద్ లో హరితహారంలో భాగంగా దాత అల్లే అశోక్ అందజేసిన చెట్లు నాటి ఎంపీపీ నిధులతో సులాబ్ కాంప్లెక్స్ నిర్మాణంకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అనురాధ, జడ్పీటీసీ సిలివేరు సిద్దప్ప, వైస్ ఎంపీపీ కాయిత రాజేంద్రర్ రెడ్డి, సూపర్నిడెండ్ రాంప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ పాల్గొన్నారు.