కేసీఆర్ నాయకత్వంతోనే దేశాభివృద్ధికేసీఆర్ నాయకత్వంతోనే దేశాభివృద్ధి – జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి


ఆకునూరులో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ
మంగళహారతులు బసవన్నలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
చేర్యాల (జనంసాక్షి) : కేసీఆర్ నాయకత్వంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామ శివారులోని రుద్రాయపల్లి కేసీఆర్ కాలనీలో బేడ బుడగ జంగాలు, గంగిరెద్దుల వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇండ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముందు మంగళహారతులు బసవన్నలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆకునూరు గ్రామంలో ఇటీవల నిర్మించిన 21 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి గృహప్రవేశం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో రైతులకు రైతు బీమా, రైతు బంధు, విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేసి రైతాంగానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అడ్డుకుంటూ రాష్ట్రాల హక్కులను కాల రాస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్, చేర్యాల మండల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, గ్రామ సర్పంచ్ చీపురు రేఖ మల్లేష్ యాదవ్, చేర్యాల తహసీల్దార్ ఎస్.కే ఆరిఫా, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పెడుతల ఎల్లారెడ్డి, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుర్మ వెంకటరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉళ్లేంగల ఏకానందం, ముస్త్యాల బాల నరసయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, ఎంపీటీసీ తౌట సుధారాణి-శ్రీశైలం, ఉప సర్పంచ్ బోయిని పద్మ-బాలయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గూడూరు బాలరాజు, పంచాయతీ కార్యదర్శి పులి బాలయ్య, గిర్ధవర్ రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోతి దాసు, తాటికొండ సదానందం, శనిగరం లక్ష్మణ్, ముస్త్యాల కిష్టయ్య, శివగారి అంజయ్య, పుప్పాల మహేందర్, వంగాల శ్రీకాంత్ రెడ్డి, పాల బాలరాజు, శనిగరం రమేష్,ఆకుల రాజేష్ గౌడ్, రణం ప్రశాంత్, బోయిని రాజు, తాటికొండ వేణు, కరెడ్ల మాధవరెడ్డి, పెంబర్ల రాజశేఖర్,తాండ్ర సాగర్, బీర రాములు, బేడ బుడగ జంగాల సంఘం జిల్లా అధ్యక్షురాలు వానరాసి ఉప్పలమ్మ, గంగిరెడ్ల సంఘం అధ్యక్షుడు జిడ్డి లచ్చయ్య, కళ్లెం రాములు తదితరులు పాల్గొన్నారు