కొండమల్లేపల్లి మండల పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రైతు సమన్వయ సమితి

కొండమల్లేపల్లి మండల పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు శనివారం రోజున మునగోడు నియోజకవర్గం పరిధి నాంపల్లి మండలంలోని దేవత్ పల్లి గ్రామంలో ఇంటింటా గడప గడపకు కలియ తిరుగుతూ గత 8 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టి,దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా రైతు బంధు,రైతు భీమా,కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్,దళిత బంధు,ఆడ పడుచులకు పెద్దన్నగా బతుకమ్మ సారె,కెసిఆర్ కిట్టు,గర్భిణీ స్త్రీలతో పాటు పుట్టిన పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ కేసీఆర్ కిట్టును అందజేస్తున్నారని తెలిపారు.ఆడపిల్ల పుడితే రూ 13,000/- వేలు,బాబు పుడితే రూ 12000/- వేలు అందిస్తున్నారని తెలిపారు.నూతనంగా పది లక్షల ఫింఛన్లు అందచేసారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకొని అభివృద్ధి పథం వైపు అడుగులు వేసే దిశగా పయనించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి, జెడ్పిటీసి పర్యవేక్షకులు పసునూరి యుగేంధర్ రెడ్డి, మాజీ ఎంపిపి మేకల శ్రీనివాస్ యాదవ్,మాజీ ఎంపిటిసి సభ్యులు మాడ్గుల యాదగిరి,పట్టణ అధ్యక్షులు మరియు వార్డ్ సభ్యులు ఎలిమినేటి సాయి,నాంపల్లి మండల యువజన విభాగం అధ్యక్షులు బత్తుల విజయ్,స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.