కొండాలక్ష్మణ్ బాపూజీకి కన్నీటి విడ్కోలు
హైదరాబాద్: తెలంగాణ పోరాట యోదుడు, స్వాతంత్ర సమరయోదుడు కొండాలక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలు జలదృష్యంలో వేలాదిమంది తెలంగాణవాదుల అశ్రునయానాల మధ్య పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. బాపూజీ కుమార్తె పవిత్ర ఆయన చితికి నిప్పంటించారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పద్మశాలి భవన్‌కు వచ్చి లక్ష్మణ్‌బాపూజీకి నివాళులర్పించారు.