కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు

హైదరాబాద్: కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి సీఎం కేసీఆర్ శాఖలను కేటాయించారు. అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను హరీశ్ రావుకు కేటాయించారు. కేటీఆర్‌కు గతంలో చూసిన మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖను కేటాయించారు. అయితే జగదీశ్ రెడ్డి వద్ద ఉన్న విద్యాశాఖను తొలగించి విద్యుత్ శాఖకు ఇవ్వగా, విద్యాశాఖను సబితా ఇంద్రారెడ్డికి కేటాయించారు. వేముల ప్రశాంత్ రెడ్డి వద్ద ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖలున్నాయి.
అయితే రవాణా శాఖను పువ్వాడ అజయ్‌కు కేటాయించారు. అత్యంత కీలకమైన జీఏడీ, ప్లానింగ్, రెవిన్యూ, మైనింగ్ నీటి పారుదల శాఖలను సీఎం కేసీఆర్ ఆయన వద్దే ఉంచుకున్నారు. కొన్ని రోజుల క్రితం శాఖల మార్పు భారీగా ఉంటుందని ప్రచారం జరిగినా దాన్ని అమలు పరచలేదు. కొత్త మంత్రుల శాఖల వివరాలు….

హరీశ్‌ రావు-ఆర్థికశాఖ
కేటీఆర్- ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖలు
సబితా ఇంద్రారెడ్డి-విద్యాశాఖ
పువ్వాడ అజయ్‌కుమార్-రవాణాశాఖ
గంగుల కమలాకర్- బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలు
సత్యవతి రాథోడ్-గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖలు
జగదీష్‌రెడ్డి- విద్యుత్ శాఖ