కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): ఉపరితల ఆవర్తనం కారణంగా మరో రెండు రోజులు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చెప్పారు. తెలంగాణ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. పలుప్రాంతాల్లో కుండపోతలా కురిసిన భారీవర్షాలతో హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో కొన్నిచోట్ల పొల్లాల్లో నీరు చేరింది. తెలంగాణ అంతటా విస్తారంగా కురుస్తున్న వర్షాలు క్రమంగా తగ్గుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంఅధికారులు చెప్పారు.

తాజావార్తలు