కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలుకొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలు

మల్దకల్ ఫిబ్రవరి 16 (జనం సాక్షి)తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో కళ్ళల్లో వెలుగులు నింపాలని జనవరి 19న ప్రారంభించగా ఇప్పటివరకు శిబిరాలు విజయవంతంగా నడుస్తున్నాయి.మల్దకల్ మండలంలో రెండు టీంలు పనిచేస్తుండగా పావనంపల్లి, మల్దకల్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు 2,680 మంది కంటి పరీక్షలు నిర్వహించుకోని కంటి అద్దాలు పొందడం జరిగింది.ప్రతిరోజు 150 మంది టార్గెట్ కాగా 148 మంది వరకు వచ్చి పరీక్షలు నిర్వహించుకుంటున్నట్లు డాక్టర్ జయమ్మ తెలిపారు. అవసరమైన వారికి రీడింగ్ గ్లాస్ పరీక్షలు నిర్వహించిన అనంతరం కొంతమందికి ప్రిస్క్రిప్షన్ గ్లాస్ అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కంటి వెలుగు శిబిరంలో డాక్టర్ జయమ్మ, పిహెచ్ఎన్ రామేశ్వరమ్మ, సరస్వతి, నవీన, డీఈవో తరుణ్ కుమార్, అప్తాల్మిక్ సురేష్, ఆశాలు సుజాత, పరిమళ, సులోచన,నరసమ్మ,అనిత తదితరులు పాల్గొన్నారు.