కోటగిరిలో ఎస్ఎస్సి విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్) పంపిణీ.

కోటగిరి ఫిబ్రవరి 15 జనం సాక్ష:-రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాల కు దీటుగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చడానికి సాయంత్రం వేల ప్రత్యేక తరగతులు కొనసాగు తున్న సందర్భంగా ఆల్పాహరం అందించే కార్యక్రమం చేపట్టిం ది.అందుకు గాను బుధవారం కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధా నోపాధ్యాయులు విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం ప్రారంభించారు.సుమారు 139 మంది పదవ తరగతి విద్యా ర్థులకు ఒక్కొకరికి రూ .15 చొప్పున ప్రభుత్వం డబ్బులు చెల్లించడం జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా నేటి నుండి ఏప్రిల్ 1 తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం వేల విద్యార్థులకు అల్పాహారం అందజేయడం జరుగుతుందన్నారు.ఈ అల్పాహార పంపిణీలో పాఠశాలఉపాద్యాయులు,సిబ్బంది,పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు