కోదాడలో ఘనంగా వేడుకలు
సూర్యాపేట,ఆగస్ట్15(జనం సాక్షి): సూర్యాపేట జిల్లాకోదాడ పట్టణంతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రేవేట్ సంస్థలో 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి …ఈ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి ఉత్తమ్,ప్రభుత్వ ఉన్నత అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు..ఈ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా నిన్న రాత్రి 11 గంటలా నుండి 12 గంటల వరకు ,సౌభాగ్యం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ కోదాడ రేడియో గురూ 90.4 ఎఫ్‌ఎం ,కోదాడ డివిజన్ పోలీస్ జాతీయ సేవా పథకంల సంయుక్త ఆధ్వర్యంలో స్వేచ్చా గమనం -2018 నిర్వహించారు… ఈ సందర్భంగా కోదాడ పట్టణ పోలీస్ అధికారులతో పాటు పట్టణ యూవత ,జాతీయ సేవా పథక విభాగం స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల నుండి రంగా థియేటర్ వరకు స్వచ్ఛ గమనం నిర్వహించారు.