కోనేరు సిఫారసులపై సదస్సు : రఘువీరా
హైదరాబాద్: మాజీ మంత్రి కోనేరు రంగారావు సిఫారసులపై జనవరి 3,4 తేదీల్లో జూబ్లీహాల్‌లో సంయుక్త కలెక్టర్‌లతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు మంత్రి రఘువీరారెడ్డి తెలియజేశారు. కోనేరు కమిటీ 104 సిఫారసులు చేయగా ప్రభుత్వం వీటిలో 90కి ఆమోదం తెలిపిందని ఆయన తెలియజేశారు.